Site icon NTV Telugu

Madhu Yashki : తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం

Madhuyashki

Madhuyashki

తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్నారు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్‌ యువత జీవితాలతో అడుకుంటున్నారని, 12 సార్లు ప్రశపత్రాలు లీకు అయ్యాయన్నారు. యువతకి ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని, తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు .. ఏజ్ రెలాక్సీఅషన్ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు మధు యాష్కీ. తిరిగి మళ్ళీ పరీక్షలు రాయాలంటే ప్రభుత్వమే ఆర్ధిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కానీ, కేటీఆర్‌ కానీ కోర్టు తీర్పుకు ఫలితంగా రాజీనామా చేయాలన్నారు.

Also Read : Health Tips : నిద్ర తక్కువైతే హార్ట్ ఎటాక్ వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

అనంతరం ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన ఎన్‌ఎస్‌యూఐ మొదటి నుంచి పోరాటం చేస్తుందన్నారు. అర్హత గల నిరుద్యోగులకు.. ఉద్యోగాలు వచ్చే వరకు అండగా ఉంటామన్నారు. టీఎస్పీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలినా కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని ప్రభుత్వం ఒకవైపు చెబుతూ.. మరో వైపు సీబీఐ దర్యాప్తు కు మాత్రం నిరాకరిస్తుందన్నారు బల్మూరి వెంకట్‌.

Also Read : Supreme Court: సీజేఐ బెంచ్‌ ముందుకు చంద్రబాబు పిటిషన్‌ విచారణ.. కేసు మంగళవారానికి వాయిదా

అయిఏ.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు పై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. ఇదే సమయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు.. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అభ్యర్థుల నుండి బయోమెట్రిక్ తీసుకోవాలని పేర్కొంది.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) రూల్స్ ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది..

Exit mobile version