Health Tips : నిద్ర తక్కువైతే హార్ట్ ఎటాక్ వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషికి తిండి, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే.. ఈ మూడు లేకుండా మనిషి ఉండలేడు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా నిద్ర లేమి సమస్య ఎక్కువగా వస్తుంది.. మనిషి సగటున 7 లేదా 8 ఖచ్చితంగా నిద్రపోవాలి.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు.. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా ప్రమాదకరమైన గుండె జబ్బుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..
ఈ నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఈ అధిక రక్తపోటు కారణంగా గుండెపై కలిగే అధిక ఒత్తిడి ధమనుల ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా ధమనులు గట్టిపడతాయి. రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. గుండెలో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది..అలాగే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి.. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది.. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ ఎక్కువగా వస్తుంది..
Also Read
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
నిద్రలేమి కారణంగా మన శరీరం యొక్క బరువు విపరీతంగా పెరుగుతుంది. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయానికి గుండె సమస్యలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నిద్రలేమి ఇలా పరోక్షంగా కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దాంతో శరీరంలో చక్కర స్థాయిలు పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉంది.. అలాగే నిద్రలేమి కారణంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా నిద్రలేమి మన గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని గుండె సంబంధిత సమస్యలు తలెత్తిన తరువాత బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అవసరమని వారు చెబుతున్నారు.. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే రోజుకు ఆరు గంటలు తప్పక నిద్రపోవాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!