Site icon NTV Telugu

MLA Madhu Sudhan Reddy: కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయి

Mla Madhu Sudhan Reddy

Mla Madhu Sudhan Reddy

Madhu Sudhan Reddy: కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలిచిందని సంకలు గుద్దుకుంటుండని., అక్కడ ఈవీఎంలు అవకతవకలు త్వరలో బయట పడతాయని., కాశ్మీర్ లో బీజేపీ ఓడిపోతే చప్పుడు చెయట్లేదని., రాహుల్ గాంధీ పై కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మోరిగే కుక్క కరవదు. కేటీఆర్ మాటలు ఎవరు పట్టించుకోరని., కేటీఆర్ తాత ముత్తాతలు దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి కాదని తెలిపారు.

Konda Surekha-KTR: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్‌!

10 ఏళ్లపాటు స్కామ్ లు చేసి చేసిన కేటీఆర్ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కామ్ లు జరగట్లేదని, వాళ్ళ చేసిన స్కామ్ లను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ బతుకమ్మ పండుగను కూడా ఈవెంట్ అంటున్నాడని.. బతుకమ్మ అంటే కవిత అని చెప్పుకున్న మీరు ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుగుతుంటే కవిత ఎక్కడ పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో మహిళలు బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడ పోయిండు? మూసి ప్రక్షాళనపై డీపీఆర్ కాకముందే లక్ష కోట్ల అవినీతి అంటున్నాడని.. తప్పుడు ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 3 సీట్లు కూడా రావని ఆయన అన్నారు.

Exit mobile version