Hyderabad: మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ కిచెన్ లైసెన్స్ సస్పెండ్..
- మాదాపూర్‌లోని శ్రీ చైతన్య కాలేజీ కిచెన్ లైసెన్స్ సస్పెండ్
- ఈ నెల 24న తనిఖీలో భాగంగా కిచెన్‌లో పలు కాలం చెల్లిన వస్తువులతో పాటు..
- అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులు ఆగ్రహం
- పదే పదే ఫిర్యాదులు రావడంతో కిచెన్ లైసెన్స్ సస్పెండ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 24న తనిఖీలో భాగంగా కిచెన్‌లో పలు కాలం చెల్లిన వస్తువులతో పాటు అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఫిర్యాదులు రావడంతో కిచెన్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. గతంలో కూడా కిచెన్ తనిఖీ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచినప్పటికి శ్రీ చైతన్య యాజమాన్యం పెడచెవిన పెట్టడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో లైసెన్స్ సస్పెండ్‌తో పాటు కిచెన్ కూడా సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
Read Also: Nagoba Jatara: రేపటి నుంచి నాగోబా జాతర.. పటిష్ట బందోబస్తు
Also Read
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించిన శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గత శుక్రవారం సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆరు నెలల్లో మూడు సార్లు తనిఖీలు చేస్తే.. మూడు సార్లు నాసిరకం కూరగాయలతో కిచెన్ మెయింటినెన్స్ చేస్తున్నారు.. గత జూన్ నెలలో కిచెన్‌లోని కూరగాయలను ల్యాబ్ కి పంపితే ల్యాబ్ అధికారులు నాసిరకమని తేల్చారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలలో చదివే వేలాది మంది విద్యార్థులకు ఈ సెంట్రల్ కిచెన్ నుంచే ఫుడ్ సరఫరా చేస్తుంది శ్రీ చైతన్య సిబ్బంది.. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచగా.. దాదాపుగా 125 కిలోల ఎక్స్పైరీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు తేల్చారు.
Read Also: Google Identity Check Feature: అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్.. ఫోన్ దొంగిలించినా ఓపెన్ చేయలేరు!
తాజావార్తలు
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!