NTV Telugu Site icon

Machilipatnam: పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ కౌంటర్‌ ఎటాక్‌.. అంతా మీ వల్లే..!

Kodali

Kodali

Machilipatnam: మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ, జనసేన నేతలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ సీనియర్ నేత, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ తదితరులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాడులకు తెగబడే సంస్కృతి పేర్ని నాని, కొడాలి నానిదే అని విమర్శించారు. బందర్‌లో గంజాయి బ్యాచ్‌ని ప్రోత్సహించి దాడులకు పురుకోల్పిందే పేర్ని కిట్టు అనే విషయాన్ని అప్పుడే ప్రజలు మర్చిపోతారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడింది ఎవరో మచిలీపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు..? మండిపడ్డారు.

Read Also: Stock Market: మళ్లీ నష్టాల్లోకి సూచీలు.. దెబ్బతిన్న ఐటీ

ఇక, పేర్ని నాని, కొడాలి నానిలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఫైర్‌ అయ్యారు టీడీపీ, జనసేన నేతలు.. దాడులకు తెగబడే సంస్కృతి మాది కాదు.. మీది అనే విషయాన్ని పేర్ని నాని, కొడాలి నాని గుర్తు పెట్టుకుంటే మంచిదనీ హెచ్చరించారు. గత ఐదేళ్లలో మీరు చేసిన అరాచకాలను మీడియా ముఖంగా బయటపెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అరాచకాలకు, అక్రమాలకు ప్రజలు చెప్పు దెబ్బలాంటి 50వేల మెజారిటీతో సమాధానం చెప్పిన ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. కరోనాలో సైతం ప్రజలకు సేవ చేస్తుంటే కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టారో, ఎంత మందిపై దాడులు చేశారో మర్చిపోయారా..!? అని నిలదీశారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు అక్కస్సుతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.. మా కార్యకర్తలపై దాడులకు పాల్పడటమే గాక తమపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Read Also: Kalki 2898AD: ట్రైలర్‌ వస్తోంది సరే.. వైజయంతీ వార్నింగ్ గుర్తుందా?

మరోవైపు.. పోలీసులను తామేదో ఆదేశాలు ఇచ్చినట్టు పేర్ని నాని, కొడాలి నాని మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు టీడీపీ-జనసేన నేతలు.. మేం ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.. పోలీసులంతా మీరు నియమించిన వాళ్లే ఉన్నారు.. కొంత మంది పోలీసులు ఇప్పటికే మీకే వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుండి మచిలీపట్నంలో 16 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి.. దాడుల్లో గాయపడ్డ 16 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు… దాడులను ప్రోత్సహించే సంస్కృతి మా నాయకుడు చంద్రబాబు, కొల్లు రవీంద్రది కాదన్న విషయం పేర్ని నాని, కొడాలి నానిలాంటి వ్యక్తులు గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవుపలికారు మచిలీపట్నం టీడీపీ, జనసేన నేతలు.