కథ బాగుంటే ఆ సినిమా థియేటర్స్ లో విడుదల అయినా లేక ఓటీటీ లో విడుదలయిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య చిన్న సినిమాలు అద్భుతమైన కంటెంట్ తో ప్రేకక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కోవలోకి చెందిందే మా ఊరి పొలిమేర చిత్రం.2021 లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతోమంది అభిమానుల కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆ మధ్య మా ఊరి పొలిమేర 2 సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ నీ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.. విడుదలైన పొలిమేర 2 ఫస్ట్ లుక్ తెగ వైరల్ అయింది.
కమెడియన్ సత్యం రాజేష్ క్షుద్ర మాంత్రికుడి గా నగ్నంగా కనిపించడం తో అందరూ షాక్ అయ్యారు.అలాగే ఈ చిత్ర టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 లో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ లాంటి వాళ్ళు నటిస్తున్నారు.ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఉత్కంఠ పెంచేలా ఉంది. చివర్లో ‘ప్రాణం తీసుడు తప్పు కాదా మామా ‘ అని అంటే.. ‘ప్రాణం తీసుడు తప్పుకాని బలిస్తే తప్పేంది’ అనే డైలాగ్ చిత్రం పై మరింత ఆసక్తి కలిగించింది.ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఒక ఆసక్తి కరమైన అప్డేట్ ను మేకర్స్ అందించారు.కవిత ఎట్లా బ్రతికి వచ్చిందో తెలియాలంటే నవంబర్ 2 న గమ్మున అచ్చేయండి. ఈ సారి థియేటర్స్ లో సూద్దాం అంటూ సినిమా విడుదల పై ఆసక్తికర పోస్ట్ చేసారు