వర్ఫ్ బోర్డ్ భూములను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ విమర్శించింది. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముక్తర్ హుస్సేన్ తో కలిసి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎంఏ సిధ్ధిఖి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 77 వేల ఎకరాలు ఉన్న వక్స్ భూములు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయని వారు అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిమ్స్ గ్రేవీయర్డ్ కోసం 125 ఎకరాల భూమిని కేటాయిస్తామని హామీని ఇచ్చి విస్మరించిందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గ్రేవీయర్డ్ లో స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
Amritha Aiyer : ట్రెండీ వేర్ లో హనుమాన్ బ్యూటీ అందాలు వేరే లెవల్..
కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం చేసుకొని , వక్ఫ్ బోర్డు భూముల నుండి 125 ఎకరాల భూమిని గ్రేవీయర్డ్ కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన ముస్లిం డిక్లరేషన్ లో వర్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని… ఆ దిశగా ప్రభుత్వం వక్స్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ తో పాటు, ఎండోమెంట్ తరహాలో అధికారాలు కల్పించాలని కోరారు. అలాగే కబ్జాలకు గురైన వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు.