Lucknow: సంబంధాలను, మానవత్వాన్ని ప్రశ్నించేలా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రహీమా బాద్ ప్రాంతంలోని ఖడౌహా గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రి మరణించిన తర్వాత ఆయన ఆస్తి కోసం మృతదేహంతో వేలిముద్ర వేయించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఖడౌహా గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఛత్రపాల్ మరణించారు. తండ్రి మరణించడంతో ఆయన కుమారుడు ఆస్తిని తన పేరుపైకి మార్చుకునేందుకు మహేంద్ర తన బంధువుతో కలిసి కుట్ర పడ్డారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించకముందే మృతదేహం చేతి బొటనవేలితో తెల్ల కాగితాలపై వేలిముద్రలు తీసుకున్నారు. మృతుడి చేతిని పట్టుకుని తెల్ల కాగితాలపై వేలిముద్ర వేయిస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు గమనించారు.
మృతదేహంతో జరుగుతున్న ఈ అమానవీయ ఘటనను చూసిన స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోను రికార్డు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తండ్రి మరణించిన వెంటనే ఆస్తి కోసం ఇలాంటి చర్యకు పాల్పడటం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధాలు, మానవత్వాన్ని మరిచి ఆస్తి కోసం మృతదేహంతో కూడా ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసుల దృష్టికి విషయం వెళ్లింది. పోలీసులు ఘటనపై సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. మృతుడి వేలిముద్రలను ఏ ప్రయోజనం కోసం తీసుకున్నారు.? ఆస్తికి సంబంధించిన పత్రాల్లో వాటిని ఉపయోగించ బోతున్నారా.? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
इससे शर्मनाक कुछ नहीं हो सकता!
लखनऊ के रहीमाबाद स्थित खड़ौहा गांव से इंसानियत को शर्मसार करने वाला मामला सामने आया है। 75 वर्षीय छत्रपाल की मौत के बाद उनके इकलौते बेटे महेंद्र ने जमीन से जुड़े कागजात तैयार कराने के लिए पिता के शव के अंगूठे का निशान सादे कागज पर लगवाया। pic.twitter.com/h21RywHG4i
— Shivaji Mishra (@08febShivaji) August 13, 2026

