ఆదివారం నాడు లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ కేఎల్ లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులను చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్నో భారీ స్కోరును సాధించగలిగింది.
Also Read: Viral Video: ఏం ఐడియా గురూ.. మండే ఎండల నుంచి ఇలా తప్పించుకోండి..
ఇన్నింగ్స్ మొదట్లో లక్నో తడబడిన ఆ తర్వాత నిదానంగా స్కోర్ బోర్డ్ పై పరుగులను రాబట్టగలిగారు. ఓపెనర్ డికాక్ 8 పరుగులతోనే త్వరగానే వెనుతిరగగా వెంటనే వచ్చిన స్టోయీన్స్ కూడా డక్ అవుట్ కావడంతో ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. దాంతో కేఎల్ రాహుల్, దీపక్ హుడా పరుగులను చేత చేస్తూ స్కోర్ బోర్డును కదిలించారు. లక్నో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 48 బంతులలో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు, దీపక్ కూడా 31 బంతులలో 7 ఫోర్ల సహాయంతో 50 పరుగులను చేయగా.. నికలోస్ పురన్ 11 పరుగులు, ఆయుష్ బదోని 18, కృనాల్ పాండ్యా 15 పరుగులతో అజేయంగా నిలిచారు.
Also Read: DC vs MI: ఉత్కంఠ పోరులో ముంబైపై నెగ్గిన ఢిల్లీ..
ఇక రాజస్థాన్ బౌలర్స్ విషయానికి కొస్తే.. సందీప్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా.., ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. రాజస్థాన్ రాయల్స్ 197 పరుగులను చేయాల్సి ఉంది.