బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. ఏకంగా 1500 పోస్టులు రెడీగా ఉన్నాయి. తాజాగా ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ కోసం మొత్తం 1500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్, ఇతర సూచించిన డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:Rishabh Pant: టెస్ట్ సిరీస్‌కు పంత్ దూరం.. 10 మందితోనే ఆడనున్న టీమిండియా!
అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణయించారు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి. జనరల్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 800, SC, ST, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 175 గా నిర్ణయించారు. రాత పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read:Thailand-Cambodia War: బోర్డర్‌లో ఘర్షణ.. 9 మంది పౌరులు మృతి
అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్ కూడా అందిస్తారు. మెట్రో అర్బన్ బ్రాంచ్‌లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000 స్టైఫండ్, రూరల్ బ్రాంచ్‌లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12,000 స్టైఫండ్ అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 07 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.