ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ప్రభాస్ తర్వాత మరో హీరో ఎవరంటే నవదీప్ అని ఇట్టే చెప్పేస్తారు. ఈమధ్య విడుదలైన ఈగల్ చిత్రంలో నవదీప్ మాస్ మహారాజా రవితేజ పక్కన నటించి మెప్పించాడు. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వివిధ సినిమాలలో అనేక క్యారెక్టర్లు చేస్తూ నటిస్తున్నాడు. ఇక ఈ హీరో విషయం సంబంధించి ఈయన ఎక్కడికి వెళ్ళినా అడిగే మొదటి ప్రశ్న మీకు పెళ్లి ఎప్పుడు అని. ఇక ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. తనను అందరూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారని.. ప్రతిరోజు తాను ఇంటికి వెళ్లిన., ఒకవేళ బయటకు వెళ్లిన ఎక్కడికి వెళ్ళినా.. నన్ను అడిగే మొదటి ప్రశ్న నా పెళ్లి ఎప్పుడు అని. దానికి సంబంధించి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు నవదీప్.
Also read: IPL 2024 Dc vs CSk: చెన్నై వరుసల విజయాలకు ఢిల్లీ బ్రేకులు వేయగలదా..?!
ఇందులో భాగంగా నవదీప్ ఏకంగా పెళ్లి కార్డు షేర్ చేసి ఒకింత షాక్ ఇచ్చాడు. పెళ్లి శుభలేఖ గురించి ప్రత్యేకంగా వీడియో చేసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. నవదీప్ షేర్ చేసిన వీడియోలో పెళ్లి కార్డు కనిపించడం నిజమే.. కాకపోతే అది పెళ్లి కార్డుల కనిపించిన.. నిజానికి అది తాను హీరోగా నటించిన లవ్ మౌళి సినిమా సంబంధించిన రిలీజ్ డేట్ పూర్తి వివరాలను తెలిపే వీడియో. నవదీప్ హీరోగా చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమాకు వినూత్నంగా ప్రమోషన్ నిర్వహిస్తూ జనాలను ఆకట్టుకునే విధంగా నవదీప్ ప్రయత్నించాడు.
Also read: Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్
నవదీప్ విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. దానిని చూసిన సినిమా లవర్స్.. బ్రదర్ నీకు నిజంగానే పెళ్లి జరగబోతుంది అంటూ ఆనందపడ్డాం.. కాకపోతే., నువ్వు అసలు విషయం చెప్పడంతో ఒకంత బాధకి లోనయ్యమంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మీ సినిమా ‘లవ్ మౌళి’ కోసం వెయిట్ చేస్తున్నామం అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరో నవదీప్ సిక్స్ ప్యాక్ బాడీతో లాంగ్ హెయిర్ తో కాస్త డిఫరెంట్ స్టైలిష్ గా నవదీప్ కనపడబోతున్నాడు. ఈ సినిమాకి అవనీంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. సినిమాని ఏప్రిల్ 19న రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం.