Pawan Kalyan-Navdeep: పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navdeep on Janasena Chief Pawan Kalyan: నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడిని చిత్ర యూనిట్ దర్శించుకుంది.
Also Read: Ambati Rayudu-SRH: సన్‌రైజర్స్ జట్టులోకి నన్నెందుకు తీసుకోలేదు.. మూడీని ప్రశ్నించిన రాయుడు!
Also Read
లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా శ్రీపాద వల్లభుడి ఆలయంలో చిత్ర బృందం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నవదీప్ విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని తెలిపారు. నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయతీగా ఎవరు పోటి చేసినా ప్రజలు ఆదరిస్తారన్నారు. పవన్‌కు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీత.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!