అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలనగర్ లో ప్రేమ వ్యవహారం, పసి పాపకు శాపంగా మారింది. గోపాల నగర్ లో నివాసం ఉంటున్న ప్రదీప్, అదే ప్రాంతానికి చెందిన యువతి స్వాతి ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడు. పలు మార్లు యువతి బంధువులు హెచ్చరించారు. ప్రదీప్ తన శైలి లో మార్పు రాకపోగా.. స్వాతికి, పువ్వులు పంపడంతో స్వాతి బాబాయ్ వివేక్‌నంద ఆగ్రహానికి గురయ్యారు. డీజిల్ తీసుకొని ప్రదీప్ నివాసం ఉంటున్న ఇంటి ముందు తలుపులకు నిప్పు పెట్టి పరారయ్యాడు. అ సమయంలో ప్రదీప్ తండ్రి ప్రకాష్ ఒక్కడే ఇంట్లో ఉండటంతో, నిప్పు అంటుకొని గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
READ MORE: Karnataka: పోక్సో కేసులో మాజీ సీఎం యడ్యూరప్ప బెయిల్‌ను పొడిగించిన కర్ణాటక హైకోర్ట్
పక్క పోర్షన్ లో ఉంటున్న చాందిని అనే నాలుగేళ్ల పాపాకు కూడా నిప్పంటుకుంది. తీవ్ర గాయాలు కాగా.. కొంపల్లిలోని వెల్నెస్ ఆసుపత్రికి తరలించారు. చాందిని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రకాశ్, అతని తండ్రి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రియురాలు స్వాతి రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతోంది. హత్య యత్నానికి పాల్పడిన వివేక్‌నంద వాహనాల విక్రయదారుడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ MORE: Side Effects of Smoking: సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారా? దాని సైజ్ తగ్గుతుందట!