మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ప్లే చేసే విషయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు లక్నో, కాన్పూర్ సహా రాష్ట్రవ్యాప్తంగా లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్నారు. అయితే లౌడ్‌స్పీకర్లను తీసే సమయంలో పోలీసులకు స్థానికులు సహాకరించారు.
Read Also: Gangs of Godavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అప్పుడేనా..?
లక్నోలోని టాకియా వలీ మసీదు, ఘాజీపూర్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించారు. అదే సమయంలో, ఫైజాబాద్‌లోని నార్త్ పోలీస్ స్టేషన్, సౌత్ పోలీస్ స్టేషన్ రసూల్‌పూర్, పోలీస్ స్టేషన్ రామ్‌ఘర్ ఏరియా నుండి దాదాపు 12 లౌడ్ స్పీకర్లను తీసివేశారు. హమీర్‌పూర్‌లో కూడా పోలీసు బలగాలతో పాటు ఎస్బీఎమ్ కో ఉదయం 5 గంటలకు ముందే మసీదుల దగ్గరకు వెళ్లారు. నగరంలోని మసీదుల ఇమామ్ లను కలుసుకుని ప్రభుత్వం జారీ చేసిన సూచనలను వారికి తెలియజేశారు.
Read Also: Saneeswara Temple: శనీశ్వర స్వామి గుడిలో అపచారం.. నూనెకు బదులు పెట్రోల్ పోసిన భక్తుడు
ఇక, కాన్పూర్‌లో గోవిద్ నగర్, నై సడక్ సహా అనేక మసీదుల నుండి ఉదయం లౌడ్ స్పీకర్లను పోలీసులు తొలగించారు. పోలీస్ కమిషనర్ ఆర్.కె. స్వర్ణకర్ నేతృత్వంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ప్రచారం నిర్వహించి మతపరమైన ప్రదేశాలు, ప్రజా స్థలాల్లో ఏర్పాటు చేసిన అక్రమ లౌడ్‌స్పీకర్లు, సౌండ్ యాంప్లిఫైయర్‌లను తొలగించారు. బండలో కూడా మసీదులు, దేవాలయాల నుంచి లౌడ్ స్పీకర్లను తీసేశారు. చిత్రకూట్‌లోని మసీదు నుంచి కూడా తొలగించారు. ఫరూఖాబాద్‌లో 37 చోట్ల సౌండ్ తగ్గించి, 9 చోట్ల లౌడ్ స్పీకర్లను తొలగించేశారు. లలిత్‌పూర్‌లోని మూడు మసీదుల్లో లౌడ్ స్పీకర్లను.. అలాగే, చాలా మసీదులలో వాల్యూమ్ తగ్గించారు. కన్నౌజ్‌లోని దాదాపు 20 మసీదులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Read Also: Prabhas: సంక్రాంతి సినిమాలపై సలార్ ఎఫెక్ట్?
అలాగే, ఫతేపూర్‌లో 14 లౌడ్ స్పీకర్లను తొలగించగా.. 21 చోట్ల సౌండ్ తగ్గించారు. ఔరయ్యాలో 19 చోట్ల లౌడ్ స్పీకర్ల పరిమాణాన్ని తగ్గించారు. నాలుగు చోట్ల లౌడ్ స్పీకర్లను తీసేశారు. వాస్తవానికి, పండుగలపై సమీక్షా సమావేశంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ లౌడ్ స్పీకర్లపై మళ్లీ ప్రచారం నిర్వహించడం గురించి మాట్లాడారు. దీనిపై మళ్లీ చర్యలు తీసుకోవాలని స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ జిల్లాలను ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు మళ్లీ యాక్టివ్ అయ్యారు. లౌడ్ స్పీకర్లపై ప్రచారం నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.