Gangs of Godavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ యంగ్ హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఫలాక్ నామా దాస్, హిట్ మూవీ స్ తో ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.అయితే షూట్‌లో ఆలస్యం కారణం గా రిలీజ్ డేట్ వాయిదా పడనుందని వార్తలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ కు మరో 10 రోజులు పట్టనుందట.
తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటూ సినిమా పై క్యూరియాసిటీ పెంచేస్తుంది.ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణ లో సితార సంస్థ బ్యానర్ తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో తెలుగు బ్యూటీ అంజలి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వక్‌సేన్ మరోవైపు VS10 లో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వక్‌సేన్ మరోవైపు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి సినిమా ను కూడా పూర్తి చేశాడు.గామి మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!