2024 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. సినిమాలకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేయాలని స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈసారి మాత్రం అంతకన్నా ఎక్కువే రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, ఈగల్, నా సామీ రంగ… ఇవి చాలవన్నట్లు డబ్బింగ్ సినిమాలైనా లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్, అయలాన్ లు కూడా సంక్రాంతి బరిలోనే నిలుస్తున్నాయి. ఇన్ని సినిమాలకి థియేటర్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి అనేది? ఈ రిలీజ్ ల విషయంలో జనవరిలో టాలీవుడ్ లో ఎంత రచ్చ జరుగుతుంది అనేది చూడాలి. రిలీజ్ డేట్స్, థియేటర్స్, కలెక్షన్స్ అనేది పక్కన పెడితే… సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి సలార్ నుంచి ప్రమాదం ఉంది.
ప్రభాస్ కి చాలా రోజులుగా హిట్ లేదు, ప్రయోగాలు చేసి ఫ్యాన్స్ డిజప్పాయింట్ చేసాడు. ఈసారి పూర్తిగా కమర్షియల్ ట్రాక్ లోకి వచ్చి ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన సలార్ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ బయటికి రానున్న సలార్ సినిమాకి కేవలం తెలుగులోనే సలార్ 170 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సలార్ డబుల్ గ్రాస్ వసూళ్లను… దాదాపు 340-400 కోట్ల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంటుంది. అంత కలెక్ట్ చేయాలి అంటే సలార్ సినిమా తక్కువలో తక్కువ మూడు వారాలైనా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాలి. సలార్ సినిమా మూడు నాలుగు వారాలు థియేటర్స్ లో నిలబడితే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి కష్టాలు తప్పవు. సలార్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సంక్రాంతి సినిమాలకి ఊహించని పోటీ ఎదురైనట్లే.