లోకేష్ కనగరాజ్.. ఈ పేరు వింటే ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు తాజాగా తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా లోకేష్ ఒక హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్‌లో యాంకర్ ఇదే ప్రశ్న అడగ్గా.. లోకేష్ చాలా కూల్‌గా, అంతే స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పారు.
Also Read : Janhvi Kapoor : ధర్మ ప్రొడక్షన్స్ నుండి జాన్వీ అవుట్.. కరణ్ జోహార్ హ్యాండిచ్చిన జాన్వీ కపూర్ షాక్.. !
‘నా మీద ఇలాంటి పుకార్లు చాలా వస్తుంటాయి. ఒక హీరోయిన్ ఏంటి.. చాలా మందితో నా పేరును కలిపేశారు. నాకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, నేను ఫ్యామిలీ మ్యాన్‌ని’ అని అసలు విషయం చెప్పేశారు. అయితే యాంకర్ అంతటితో ఆగకుండా ‘మరి రెండో ఫ్యామిలీ ఆలోచన లేదా?’ అని వెటకారంగా అడిగేసరికి లోకేష్‌కు చిర్రెత్తుకొచ్చింది. “దీనికి నేను సమాధానం చెప్పను” అని కరాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అంతేకాదు, తన సినిమాల్లో డ్రగ్స్ ఎక్కువగా చూపిస్తున్నారనే విమర్శలపైనా ఆయన సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. “డ్రగ్స్ లేని సమాజం ఉండాలనే ఉద్దేశంతోనే నేను వాటివల్ల వచ్చే నష్టాలను నా సినిమాల్లో (ఖైదీ, విక్రమ్, లియో) చూపించాను. ఒకవేళ నేను అలాంటి సినిమాలు మానేస్తే సమాజంలో మార్పు వస్తుందంటే.. ఇకపై డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీయను” అని మాటిచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా కోసం లోకేష్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. బహుశా అందులో మనం కొత్త లోకేష్‌ను చూస్తామేమో!
