పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు పట్టు సాధిస్తున్నారు. చేవెళ్లలో ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి 559 ఓట్ల ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వరంగల్‌లో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కడియం కావ్య 8404 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు. నాలుగు రౌండ్లు ముగిసే సరికి వారికి 55 వేల 654 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొదటి రౌండ్ నుండి ముందంజలో ఉన్నారు.
దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి మాధవి లత ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆమె ముందంజలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వెనుకంజలో ఉన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ 8,852 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ అభ్యర్థులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కడా ప్రభావం చూపడం లేదు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి ముందంజలో ఉండగా బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు కౌటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు.
వరంగల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి అరూరి రమేష్ 242 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో మెజారిటీ ఓట్లను కోల్పోయారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 19,935 ఆధిక్యంలో ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సత్తా చాటిన ఈటల తొలి రౌండ్ లోనే 11 వేల మెజారిటీ సాధించారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత వెనుకబడ్డారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ఆధిక్యంలో ఉన్నారు. నిజామాబాద్‌లోనూ ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నారు.