NTV Telugu Site icon

Lok Sabha Elections: కాషాయ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు

Bjp Logo

Bjp Logo

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గా్ల్లో కీలక నేతలు జెండాలు మారుస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వలసల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి చేరుకోగా మరి కొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్ రెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అదే విధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి కుమారుడు ముదిగంటి వెంకట్ శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి ఆ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు శ్రీనివాస్ రెడ్డి చేయూత నందించనున్నారు.

READ MORE: Maldives: మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన డ్రాగన్ రీసెర్చ్ షిప్.. ఆంతర్యమేంటో..!

రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాబోవు అసెంబ్లీ ఎన్నికలపై కూడా కసరత్తు చేస్తోంది. తెలంగాణాలో కాషాయ జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది బీజేపీ.. ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తి నేతలపై కన్నేసింది. వారినే టార్గెట్గా చేసుకుని సమయం దొరికి నప్పుడు నెమ్మదిగా పార్టీలోకి లాగుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలోని మెజార్టీ నాయకులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ప్రకటించిన ఎంపీ అభ్యర్థు్ల్లో సైతం చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు ఉండటం విశేషం.

Show comments