Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. ఒకే నియోజకవర్గం నుంచి మాజీ భార్యభర్తలు పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex Wife and Husband contesting in Bishnupur: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను తాజాగా సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా బిష్ణుపుర్ నియోజకవర్గం నుంచి మాజీ భార్యభర్తలు పోటీ పడుతుండటం గమనార్హం.
బిష్ణుపూర్ నియోజకవర్గంలో టీఎంసీ తరఫున సుజాతా మండల్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ నుంచి సౌమిత్రా ఖాన్ బరిలో ఉన్నారు. బిష్ణుపూర్ నియోజకవర్గంలో ఖాన్ సిట్టింగ్ ఎంపీ కూడా. అయితే సౌమిత్రా ఖాన్, సుజాతా మండల్ మాజీ భార్యభర్తలు కావడం ఇక్కడ విశేషం. ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుండడం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. వీరిద్దరూ 2021లో విడిపోయారు. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుజాత, సౌమిత్రా విడిపోయారు.
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Also Read: Rahul Dravid: భారత ఆటగాళ్లకు నా వీడియోలను చూపించా.. అందుకే సిక్సర్లు బాదుతున్నారు: ద్రవిడ్
2019లో లోక్‌సభ ఎన్నికల ముందు సౌమిత్రా ఖాన్ టీఎంసీని వీడి..బీజేపీలో చేరారు. అప్పుడు సుజాత మండల్ తన భర్త తరఫున భారీ ఎత్తున ప్రచారం చేశారు. అయితే 2021లో టీఎంసీ పార్టీలో సుజాత చేరారు. దాంతో అసహనానికి గురైన సౌమిత్రా.. కెమెరా ముందే ఆమెతో విడిపోతున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలలో వీరిద్దరు పోటీ పడనున్నారు. టీఎంసీ సుజాత మండల్ పేరు ప్రకటించగానే.. రాజకీయ అనుభవం ఉన్న ఎవరైనా బిష్ణుపూర్ నియోజకవర్గంలో నిలబడితే బాగుండేదని, మంచి పోటీ ఉండేదని సౌమిత్రా ఖాన్ విమర్శించారు. చూడాలి మరి మాజీ భార్యభర్తలలో గెలుపు ఎవరిదో.
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!