NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం.. ఒంటి గంట వరకు ఎంతంటే?

Telangana

Telangana

Lok Sabha Elections 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. ఆరు గంటల్లో అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. తెలంగాణ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం నమోదైనట్లు సీఈవో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 3.4 శాతం ఎక్కువ పోలింగ్‌ నమోదైనట్లు పేర్కొన్నారు. పలువురిపై ఫిర్యాదులు వచ్చాయని.. విచారణ చేపడతామని తెలిపారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 29.03 శాతం ఓటింగ్ నమోదైంది.

Read Also: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్‌ ఇచ్చిన మాధవి లత

లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతాలు చూస్తే..
*హైదరాబాద్‌-19.37 శాతం
*సికింద్రాబాద్‌- 24.91 శాతం
*మల్కాజ్‌గిరి-27.69 శాతం
* ఆదిలాబాద్‌-50.18 శాతం
* భువనగిరి- 46.49 శాతం
* చేవెళ్ల- 34.56 శాతం
* కరీంనగర్- 45.11 శాతం
*ఖమ్మం-50.63 శాతం
* మహబూబాబాద్‌- 48.81 శాతం
*మహబూబ్‌నగర్‌ 45.84 శాతం
* మెదక్- 46.72 శాతం
* నాగర్‌కర్నూల్-45.88 శాతం
*నల్గొండ- 48.48 శాతం
* నిజామాబాద్‌- 45.67 శాతం
*పెద్దపల్లి-44.87 శాతం
* వరంగల్-41.23 శాతం
* జహీరాబాద్‌-50.71 శాతం ఓటింగ్ నమోదు.