దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 88 స్థానాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. సెకండ్ విడతలో 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో మాయవతి పార్టీకి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందడంతో పోలింగ్ షెడ్యూల్‌ను మార్చారు. దీంతో శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓటింగ్ నడుస్తోంది. బెతుల్‌లో మే 7న పోలింగ్ జరగనుంది. రాజస్థాన్, కేరళలో అన్ని స్థానాలకు ఓటింగ్ నడుస్తోంది. అయితే పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 ఒంటి గంట వరకు 39 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. సాయంత్రానికి పుంజుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎండలు కారణంగా బీహార్‌లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Uniform Civil Code: భారతదేశం అంతటా ఒకే సివిల్ కోడ్.. ఇది మోడీ హామీ..
కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం, బీహార్‌లో ఐదు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో మూడింటికి రెండో దశ పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, త్రిపురలో ఒక్కొక్కటి చొప్పున పోలింగ్ జరుగుతోంది. రెండో దశ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్, శశిథరూర్, హేమ మాలిని, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పోటీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Balmoori Venkat: హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వం..!
తదుపరి ఎన్నికల పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఇక తెలంగాణలో అయితే పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. అనంతరం మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Komati Reddy: నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే.. హరీష్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్