Kushi: మ్యూజిక్ లవర్స్‌కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushi Second Single To Release On July 12: విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఇదివరకే ఒక పాటని విడుదల చేసి, ప్రేక్షకులకు మెలోడియస్ ట్రీట్ ఇచ్చింది. ‘నా రోజా నువ్వే’ అనే పాట ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ.. ఈ పాటే తెగ చక్కర్లు కొడుతోంది. మ్యూజిక్ లవర్స్ అయితే దీనిని లూప్‌లో వింటున్నారు.
Rekha Nair: అక్కడ చెయ్యి వేస్తే, నేను బాగా ఎంజాయ్ చేస్తా.. టీవీ నటి సంచలన కామెంట్స్
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ఇప్పుడు ‘ఖుషీ’ మేకర్స్ మరో మెలోడియస్ పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్‌ని తాజాగా ఇచ్చారు కూడా! ‘ఆరాధ్య’ అనే సాంగ్‌ను జులై 12వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో విజయ్, సమంత ఎదురెదురుగా కూర్చొని.. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని నవ్వులు చిందిస్తూ.. రొమాంటిక్ పోజ్‌లో క్యూట్‌గా కనువిందు చేశారు. తొలుత జులై 10న ప్రోమోను, ఆ తర్వాత ఫుల్ సాంగ్‌ను జులై 12న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు.. లూప్‌లో వినేలా ఈ మెలోడియస్ సాంగ్ ఉంటుందని, ‘నా రోజా నువ్వే’ పాట తరహాలోనే దీనికి అడిక్ట్ అవ్వడం ఖాయమంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెప్పారు. మరి, ఈ పాట ఆ రేంజ్‌లో ఉంటుందో లేదో చూడాలి.
Project K Merchandise: ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. ఈ టీ-షర్ట్స్ సొంతం చేసుకోండి
ఈ సెకండ్ సింగిల్‌ని తెలుగు తమిళ భాషల్లో సిడ్ శ్రీరామ్, చిన్మయీ శ్రీపాద పాడగా.. తెలుగు వర్షన్‌కి శివ నిర్వాణ, తమిళ వర్షన్‌కి మదన్ కార్కి సాహిత్యం అందించారు. ఇక హిందీ వర్షన్‌లో జుబిన్ నోటియాల్, పలక్ ముంచల్ తమ గాత్రం అందించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
Giving you another melodious number to listen on loop ❤️🔥#Kushi Second Single #Aradhya on 12th July ❤️
Song promo out on 10th July 💥
Telugu
🎤 @sidsriram @Chinmayi
✍️ @ShivaNirvanaHindi
🎤 @JubinNautiyal @palakmuchhal3
✍️ @raqueebalamTamil
🎤 @sidsriram @Chinmayi
✍️… pic.twitter.com/yXOEqZfNV6— Mythri Movie Makers (@MythriOfficial) July 8, 2023
తాజావార్తలు
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!