NTV Telugu Site icon

Hyderabad : మందుబాబులకు షాకింగ్.. నేడు వైన్ షాపులు బంద్!

Liquor Shops Closed

Liquor Shops Closed

మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్…హైదరాబాద్‌ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్‌ షాపులు ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.

READ MORE: MS Dhoni Retirement: చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు.. రిటైర్మెంట్‌పై ఊహాగానాలు!

మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించే శ్రీరామ నవమి ర్యాలీలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.

READ MORE: CM Revanth Reddy: తొలిసారి సీఎం హోదాలో భద్రాద్రికి సీఎం రేవంత్‌రెడ్డి.. ముత్యాల తలంబ్రాల సమర్పణ..