FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026 Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్ ను తమతోనే ఉంచుకొనేలా ఆటను ఘనంగా ప్రారంభించింది. నేడు జరిగిన మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది అర్జెంటీనా. మ్యాచ్ లో కెప్టెన్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే మెస్సీ దూకుడుగా ఆడాడు. ఎనిమిదో నిమిషంలోనే గోల్ సాధించినప్పటికీ.. ఆ ప్రయత్నం ఆఫ్‌సైడ్ కారణంగా రద్దు కావడంతో అర్జెంటీనా ఆధిక్యం సాధించలేకపోయింది. అయితే ఆ నిరాశ మెస్సీ ఆటపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
మొదటి అర్ధభాగం మధ్యలో మెస్సీ తన ట్రేడ్‌మార్క్ సోలో రన్‌తో అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. మిడ్‌ఫీల్డ్‌లో బంతిని అందుకున్న మెస్సీ, పలువురు డిఫెండర్లను దాటుకుంటూ ముందుకు వెళ్లి.. బాక్స్ అంచు నుంచి ఎడమ కాలి షాట్‌తో గోల్ సాధించాడు. ఆ షాట్‌ను అల్జీరియా గోల్‌కీపర్ లూకా జిదాన్ అడ్డుకోలేకపోయాడు. రెండో అర్ధభాగంలో కూడా అర్జెంటీనా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. 60వ నిమిషంలో అలెక్సిస్ మాక్ అలిస్టర్ కొట్టిన బలమైన షాట్‌ను గోల్ కీపర్ తిప్పికొట్టినా, రీబౌండ్పై వేగంగా స్పందించిన మెస్సీ బంతిని గోల్‌పోస్ట్ లోకి పంపించి తన రెండో గోల్ నమోదు చేశాడు.
Also Read
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- ICC Women's T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్‌సభ స్పీకర్‌తో భేటీకి ఎంపీలు రెడీ..
మ్యాచ్‌లో కీలక ఘట్టం 76వ నిమిషంలో చోటుచేసుకుంది. పెనాల్టీ బాక్స్ వెలుపల బంతిని అందుకున్న మెస్సీ, అద్భుతమైన లో షాట్‌తో మరోసారి గోల్ సాధించి తన తొలి వరల్డ్ కప్ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. దీంతో అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేశాడు. ఈ హ్యాట్రిక్‌తో మెస్సీ వరల్డ్ కప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 16కు చేర్చుకున్నాడు. దీంతో జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజే పేరిట ఉన్న అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ రికార్డును సమం చేశాడు.
మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు.. 79వ నిమిషంలో మెస్సీని విశ్రాంతి కోసం మైదానం నుంచి తప్పించారు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న అభిమానులు నిలబడి చప్పట్లతో అతడికి ఘన స్వాగతం పలికారు. మెస్సీ కూడా మైదానాన్ని వీడేందుకు ఇష్టపడనట్లు కనిపించినా, ముందున్న కీలక మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని కోచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. అద్భుత విజయంతో వరల్డ్ కప్ లో శుభారంభం చేసింది.
Lionel Messi is now the joint top #FIFAWorldCup goalscorer 🔝📊 pic.twitter.com/0wtOUS2ylM
— FIFA World Cup (@FIFAWorldCup) June 17, 2026
3 goals, 3 points, 1 Messi. #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 17, 2026
తాజావార్తలు
-
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
-
Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
-
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
-
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
-
Rohit Sharma: ‘అతనికి ప్రతిభ పుట్టుకతో రాలేదు..’ రోహిత్ శర్మపై రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!