ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ కూడా లేఆఫ్ బాట పట్టిందని సమాచారం. రిక్రూట్‌మెంట్ విభాగానికి చెందిన ఉద్యోగుల్లో కొందరిని తీసేస్తున్నట్లు సంస్థ వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ది ఇన్ఫర్మేషన్ అనే వెబ్‌సైట్ కథనం రాసింది. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన లేఆఫ్ ప్రణాళికలో లింక్డ్ఇన్ కూడా చేరినట్లు తెలిసింది. ఎంతమందిని తొలగించిందన్న సమాచారం మాత్రం ఇంకా తెలియరాలేదు.
Also Read: WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా 10వేల మందిని తొలగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగిస్తున్నట్లు జనవరిలో వెల్లడించింది. అయితే, ఏ విభాగంలో ఎంతమందిని తొలగించేది మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ తొలగింపులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌కు చెందిన సియాటెల్ కార్యాలయంలో 600 మందిని తొలగించారు. ఈ క్రమంలోనే లింక్డ్ఇన్ తొలగింపులు జరగనున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద పెద్ద టెక్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి.
Also Read: Mumbai : చెత్త రికార్డును నెలకొల్పిన ముంబై.. కాలుష్యంలో నెం.1