LinkedIn: ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్‌ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్‌ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి.