Site icon NTV Telugu

Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు.. భయబ్రాంతులకు గురైన జనం..!

Gachibowli

Gachibowli

Gachibowli: హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడింది. భారీ శబ్దం రావడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. పిడుగు ధాటికి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Russian Influencers: ఉక్రెయిన్ దాడిలో ఆయిల్ డిపో తగలబడుతుంటే.. కూల్ గా రీల్స్.. షాకిచ్చిన ప్రభుత్వం(వీడియో)

కాగా.. వారం రోజుల గ్యాప్ తర్వాత.. మళ్లీ వరుణుడు హైదరాబాద్‌ను ముంచేశాడు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్.ఆర్.నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలల్లోనూ వర్షం కుమ్మేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాల్లో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు సైతం జారీ చేసింది. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరించింది.

READ MORE: Mohammed Siraj: హైదరాబాద్‌లోనే కాదు, ఎక్కడున్నా సిరాజ్కి బిర్యానీ!

Exit mobile version