Life Imprisonment: ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా సోమవారం 34 ఏళ్ల జలంధర్ రాయ్‌ను దోషిగా నిర్ధారించడంతో పాటు రూ.15,000 జరిమానా కూడా విధించారు. ఇకపతే ఈ సంఘటన జనవరి 11, 2020 న జరిగింది. అప్పుడు నిందితుడు జలంధర్ రాయ్ బాధిత బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ (ఏడీజీసీ) ఫణీంద్ర కుమార్ త్రిపాఠి తెలిపారు. అక్కడ ఆమెను నాశనం చేసాడని, తన చర్యకు సంబంధించిన అభ్యంతరకర వీడియోను కూడా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి దానిని వైరల్‌గా చేసాడు. అంతేకాదు బాలికను చంపేస్తానని బెదిరించాడు కూడా.
Also Read: Bangladesh: ఇస్కాన్ బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్‌తో సోషల్ మీడియా ప్రచారం..
కొన్ని రోజుల తర్వాత బాధిత బాలికకు అసభ్యకరమైన వీడియో గురించి తెలిసిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆ వీడియో వైరల్‌గా మారి పరువు తీయడంతో ఆమె షాక్‌కు గురైంది. దీని తరువాత, ఆమె నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం వెలుపల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (బెదిరింపు), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 554 (ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో దాడి చేయడం) కింద కేసు నమోదు చేశారు. దీనితో పాటు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, షెడ్యూల్డ్ కులాలు – షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం నిబంధనలు కూడా విధించబడ్డాయి.
Also Read: Relationship Tips: ఈ విషయాలు వైవాహిక జీవితాన్ని నాశనం చేయొచ్చు.. జాగ్రత్త సుమీ
ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా నిందితుడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. న్యాయమూర్తి నిందితుడికి 15 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో కోర్టు ఆదేశం మేరకు శిక్షను మరో నెల పొడిగిస్తామని తెలిపారు. కోర్టు ఈ నిర్ణయంపై బాధితరాలు వారు సంతృప్తి వ్యక్తం చేసారు.