చిరుతలు అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో చిరుతపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలోనూ ఓ చిరుత తన ప్రతాపం చూపుతోంది. Hetero పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలో Hetero పరిశ్రమలో చిరుత సంచారం ఉద్యోగులను పరుగులు పెట్టిస్తోంది. Hetero పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో దాగి చిరుత దాగి ఉందని తెలుస్తోంది.
Read Also: Clashes in Macherla: మాచర్ల ఘటన ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కంపెనీలోకి చిరుత ప్రవేశించిందంటున్నారు. ఆ చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం కూడా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు కార్మికులు. చిరుతను బంధించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
హెటిరో పరిశ్రమకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. DFO శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు.. ఎవరూ బయటకు రావద్దంటున్నారు. భయంతో బిక్కు బిక్కు మంటున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు. ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులుల సంచారం వెలుగులోకి వచ్చింది. వారంరోజుల తర్వాత మల్లీ పులులు రోడ్డుపై కనిపించడం కలకలం రేపుతుంది. పిప్పల్ కోఠి రిజర్వాయర్ వద్ద వాహనం డ్రైవర్ పులులను వీడియో తీసాడు..ప్రస్తుతం పులుల వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాదముద్రల సేకరించారు.
పులుల సంచారం నిజమే అని ధృవీకరించారు అటవీశాఖ అధికారులు. నడిరోడ్డుపై నాలుగు పులులు కనిపించగా అప్పుడు సైతం ఓ వాహనం డ్రైవర్ వీడియో తీయగా అవి సైతం వైరల్ అవుతున్నాయి..పులుల సంచారంతో తాంసికే,గోల్లఘాట్ ,పిప్పల్ కోఠి గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొమురం భీం జిల్లాలోని పెంచికల్ పేట ,బెజ్జూర్ మండలాల్లో పులి సంచరిస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
Read Also:Fire Accident in Oil Mill: అయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు