కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లియో’. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో సినిమా విడుదలకు ముందే భారీగా హైప్ వచ్చింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయింది. కానీ ఎంతో హైప్ తో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..టాక్ ఎలా వున్నా కానీ ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తుంది.తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. ‘LCU’ పేరుతో డిఫరెంట్‌గా మూవీస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. వీటికి లింక్ చేస్తూ ‘లియో’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై ఓ రేంజులో అంచనాలు ఏర్పడ్డాయి. మ్యూజిక్, టేకింగ్ విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ చిత్రం.. కథ, కథనాల విషయంలో మాత్రం ఫెయిలైందనేది కొందరు ప్రేక్షకుల అభిప్రాయం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్‌కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ అస్సలు పార్తిబన్ ఎవరు..అస్సలు లియో ఎవరు..అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది ఈ సినిమా.. భారీగా కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా థియేటర్ రిలీజ్‌కి ముందే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్‌లో భాగంగానే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం…