Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Layouts Are Ready In R5 Zone

R5 Zone Layouts: ఆర్ ఫైవ్ జోన్‌లో లేఅవుట్లు రెడీ..

Published Date :May 24, 2023 , 8:44 pm
By Sudhakar Ravula
R5 Zone Layouts: ఆర్ ఫైవ్ జోన్‌లో లేఅవుట్లు రెడీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

R5 Zone Layouts: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం ఇవ్వనుంది. అమరావతి పరిధిలోని పలు గ్రామాల పరిధిలో సుమారు 1402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని లే అవుట్ లలో అభివృద్ధి ప్రక్రియ పూర్తి అయ్యింది. సరిహద్దు రాళ్లు వేయటమే కాకుండా వాటి పై నెంబరింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఆ యా లే అవుట్ల దగ్గర లే అవుట్ మ్యాప్ లను కూడా ప్రదర్శనకు పెట్టారు.

మరోవైపు వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు 50 వేల మంది లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా లే అవుట్ లలోనే సభ ఏర్పాటు చేయాలని భావించినా…గ్రామాల రహదారులు ఇరుకుగా ఉండటంతో సీడ్ యాక్సిస్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సభకు ఎంపిక చేశారు. ఆ పక్కన వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా లాంఛనంగా పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత లబ్దిదారులకు షెడ్యూల్ తేదీలు ఖరారు చేసి వాటి ప్రకారం పట్టాలు అందజేస్తారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. మొత్తం లే అవుట్ స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాంటింగ్ చేశారు. మిగిలిన భూమిలో అంతర్గత రోడ్ల కోసం ఎక్కువ స్థలం కేటాయించారు. అప్రోచ్, అంతర్గత రోడ్లకు 36 శాతం భూమిని కేటాయించారు. మొత్తం ల్యాండ్లో 10 శాతం ఓపెన్ స్పేస్ గానూ, మిగిలిన భూమిని పార్కింగ్, యుటిలిటీ కోసం కేటాయించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల తయారీ కసరత్తు కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ఆన్ లైన్ చేయటం, లబ్దిదారుల మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎల్లుండి పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా చేపట్టనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Amaravati R5 zone
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Layouts Ready

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions