NTV Telugu Site icon

TDP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు

Tdp

Tdp

TDP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా దగ్గుమళ్ల ప్రసాద్ రావు, బైరెడ్డి శబరిలను చంద్రబాబు నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ పార్టీ విప్‌గా గంటి హరీష్ నియామకమన్నారు. ఈసారి లోక్ సభలో తెలుగుదేశంకి 16ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీల ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.

Read Also: Minister Payyavula Keshav: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించాను..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు.