Delhi Girl Murder Case: రెండు రోజుల క్రితం ఢిల్లీలోని షాబాద్ ఏరియాలో 16 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడు సాహిల్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. భద్రతాకారణాల రీత్యా నిందితుడిని కోర్టుకు కాకుండా రోహిణి కోర్టు డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జ్యోతి నాయిన్ ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి .. నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితుడు సాహిల్ హత్యకు వినియోగించిన ఆయుధాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడు మాటిమాటికి మాట మారుస్తున్నాడని.. కాబట్టి కేసులో స్పష్టత కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయమూర్తికి సమర్పించిన డాక్యుమెంట్లలో కోరినట్లు సమాచారం.
Read Also: Jupalli krishna rao: నేను పొంగులేటి ఇద్దరమే కాదు.. ఈటెల లాంటి వాళ్లు కూడా మాతోనే..!
అయితే నిందితుడు సాహిల్, హత్యకు గురైన బాలిక గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఆదివారం బాలిక రిలేషన్‌ను ఆపేద్దామని చెప్పడంతో సాహిల్ ఆగ్రహానికి లోనయ్యాడని.. అదే ఆవేశంతో బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా పక్కనున్న కంకర, సిమెంటుతో కూడిన గడ్డతో తలపై మోదాడని చెప్పారు.