Site icon NTV Telugu

Bharat Ratna: దివంగత బీహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న..

Takur

Takur

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రాష్ట్రపతి విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. కాగా.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ పోస్ట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. బీహార్‌లో ప్రజా నాయకుడిగా ఎదిగిన కర్పూరీ ఠాకూర్ 1924లో జన్మించారు. ఆయన బీహార్‌కు కాంగ్రెసేతర మొదటి ముఖ్యమంత్రి. కర్పూరి ఠాకూర్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారి 1970 డిసెంబర్ నుంచి 1971 వరకు, రెండోసారి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు సేవలందించారు.

General Elections: ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన ఈసీ

కర్పూరి ఠాకూర్ 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1967లో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక, బీహార్‌లోని మహామాయ ప్రసాద్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్పూరీ ఠాకూర్ పార్లమెంటరీ జీవితం అధికారంతో నిండిపోయింది. ఎక్కువ కాలం ప్రతిపక్ష రాజకీయాలు చేశాడు. బీహారీలు ఆయనను గౌరవంగా ‘జన్ నాయక్‌’గా పిలుచుకుంటారు. ఈయన గోకుల్ ఠాకూర్, రామ్దులారి దేవి దంపతులకు జన్మించారు. పితౌంఝియా అనే చిన్న గ్రామంలో జన్మించిన నాయీ సామాజిక వర్గానికి చెందిన కర్పూరీ ఠాకూర్ ముఖ్యమంత్రిస్థాయికి ఎదిగారు.

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అనుకున్నదే అయింది?

Exit mobile version