మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ కార్డుతో లింక్ చేశారా? అయితే త్వరపడండి. గడువు ముంచుకొచ్చేస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలి. లేదంటే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు చాలాసార్లు పొడిగించింది కేంద్రం. అయితే ఈసారి మాత్రం గడువు పొడిగించే అవకాశం లేదంటున్నారు. అయితే, ప్రస్తుత గడువులోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డు పని చేయదు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పాన్-ఆధార్ లింకింగ్ కొందరికి మినహాయింపు ఉంది.ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులకు మినహాయింపు ఉంది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నాన్-రెసిడెంట్, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, భారతదేశ పౌరుడు కాని వారికి మినహాయింపు ఉంది.
Read Also: Holi Festival : మందుబాబులకు అలర్ట్.. నేటి నుంచి వైన్‌షాపులు బంద్
పాన్ కార్డుని ఆధార్ తో ఎలా లింక్ చేయాలంటే..
* ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలి eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.in ని సంప్రదించాలి
*ఇప్పటికే రిజిస్టర్ చేయకుంటే మీ పాన్‌తో యూజర్ IDగా పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
*పోర్టల్‌లోకి లాగిన్ అయి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో కనిపిస్తుంది. మెనూ బార్‌లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్‌లు’కి వెళ్లి లింక్ ఆధార్‌పై క్లిక్ చేయాలి
*పాన్ కార్డ్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు కనిపిస్తాయి
* ఆధార్‌లో ఉన్న మీ వ్యక్తిగత వివరాలను అందులో ధృవీకరించాలి. మీ వివరాలు సరిగ్గా ఉంటే.. ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, లింక్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి.
* వీటితో పాటు https://www.utiitsl.com/, https://www.egov-nsdl.co.in/ ద్వారా కూడా లింక్ చేయవచ్చు
* లేదంటే… సమీపంలోని PAN సేవా కేంద్రాలను సందర్శించి నమోదు ప్రక్రియ పూర్తిచేయవచ్చు.
* మీకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు, సందేహాలు ఉంటే సమీపంలోని PAN సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లింక్ చేసే ప్రక్రియను మాన్యువల్‌గా కూడా చేయవచ్చు. వెంటనే గడువు తేదీలోగా పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయండి.
Read Also: Exxeella Education Group: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి అనూహ్య స్పందన