Bihar political crisis: నితీష్‌కు చెక్ పెట్టేందుకు లాలూ మాస్టర్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. మహాకూటమి నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆర్జేడీ కసరత్తు ప్రారంభించింది. దెబ్బకు దెబ్బ కొట్టేందుకు పార్టీ నేతలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యనేతలతో కలిసి మేథోమదనం చేస్తున్నారు. బీహార్‌లో తమకే ఎక్కువ మెజార్టీ ఉందని లాలూ ప్రసాద్ అన్నారు. చిన్న పార్టీలతో కలిసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ అధినేత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ తమకే ఉందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు మీడియాకు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ నేతలంతా సమావేశం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో లాలూ సమాలోచనలు చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పూర్ణియాలో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నుంచి గట్టేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు.
Read Also: Kejriwal: బీజేపీ కుట్ర.. మా ఎమ్మెల్యేలను కొనేందుకే నన్ను అరెస్ట్ చేస్తారటా..?
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
బీహార్‌లో ప్రస్తుతం ఇలా..
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. కనీస మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78కి, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్ఏఎం(ఎస్)కు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసే ఉన్నాయి. ఈ మూడు పార్టీల బలం 114 మంది ఉన్నారు. మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. జేడీయూ-బీజేపీ చేతులు కలిపితే మాత్రం 123 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ తమకే ఉందని ఆర్జేడీ అంటుంది. బీహార్‌లో చోటుచేసుకున్న ఈ సంక్షోభం ఎలా ముగుస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!