తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వం లో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి తలైవా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో తలైవా ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న సినిమాలలో లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాను ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం లో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది. లాల్ సలామ్ చిత్ర యూనిట్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది. తాజాగా ఫస్ట్ సింగిల్ పై అప్‌డేట్ ను అందించింది.
లాల్ సలామ్ ఫస్ట్ సింగిల్ ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్ర యూనిట్ సాంగ్ లుక్ ను విడుదల చేసింది. సంప్రదాయ నృత్యంతో ఈ పాట ఉండబోతున్నట్టు హింట్ ఇవ్వగా.. తాజా లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’ మరియు ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది. చాలా రోజుల తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం తో లాల్ సలామ్ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం లో తలైవా 170 సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. అలాగే దీంతోపాటు రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తలైవా 171లో కూడా నటిస్తున్నారు.
Let the festivities begin! ☀️🌾✨ The 1st single 'THER THIRUVIZHA' from LAL SALAAM drops tomorrow at 5PM! 🕔
An @arrahman musical 🎶
Audio on @SonyMusicSouth 📼#LalSalaam 🫡 @rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @LycaProductions #Subaskaran… pic.twitter.com/90MDibzSt9— Lyca Productions (@LycaProductions) December 17, 2023