China : దక్షిణ చైనాలో ఒక పెద్ద రహదారి కూలిపోవడంతో కనీసం 19 మంది మరణించారు. స్థానిక మీడియా ద్వారా విడుదలైన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. హైవేపై జరిగిన నష్టం ఈ చిత్రాలు, వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 30న తెల్లవారుజామున 2 గంటలకు దక్షిణ చైనాలోని ఒక ప్రాంతంలో హైవే ఒక భాగం కూలిపోవడంతో చాలా మంది మరణించారు. ఈ సంఘటన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ నగరంలో జరిగింది. ఇక్కడ హైవేలో ఎక్కువ భాగం కూలిపోయింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న 19 మంది మరణించారు. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో భారీ వర్షం వంటి పరిస్థితి ఉందని మాజో నగర ప్రాంతానికి చెందిన స్థానిక అధికారి చెప్పారు. ఈ ఘటనకు వర్షమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సంఘటన స్థలం నుండి వెలువడిన చిత్రాలలో కూడా కాలువలో పడిపోయిన వాహనాలను స్పష్టంగా చూడవచ్చు.
Read Also:Madhyapradesh : అన్నంలో మత్తుమందు పెట్టి.. రెండో తరగతి చిన్నారి పై హాస్టల్లో అత్యాచారం
Meizhou నగరంలో జరిగిన ఈ ప్రమాదం గురించి ఒక అధికారి మాట్లాడుతూ.. హైవే 17.9 మీటర్లు అంటే 58.7 అడుగుల పొడవైన భాగం కుప్పకూలిందని, దీని కారణంగా దాదాపు 18 వాహనాలు వాలుపై పడిపోయాయని తెలిపారు. ఈ సంఘటన అర్ధరాత్రి జరిగింది. స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోలు, చిత్రాలలో సంఘటన స్థలంలో వాహనాలు పడిపోవడం వల్ల పొగ, మంటలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది 30 మందిని ఆసుపత్రికి తరలించారు. హైవే నుంచి కిందికి చూస్తే మంటల్లో కాలిపోయిన వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం తర్వాత హైవే మొత్తం జామ్ అయింది.
Read Also:Vijayasai Reddy: దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు..