NTV Telugu Site icon

Haryana-Rajasthan: హర్యానా-రాజస్థాన్‌ పోలీసుల మధ్య వార్.. కారణం ఇదే..

Haryana Rajasthan

Haryana Rajasthan

టికెట్ తీసుకోనందుకు హర్యానాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్ జారీ చేశారు. దీంతో హర్యానా, రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ కారణంగా.. హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు జారీ చేయగా.. ఆదివారం రాజస్థాన్‌లో హర్యానా రోడ్‌వేస్ బస్సులకు 26 చలాన్లు జారీ చేయబడ్డాయి.

READ MORE: Vijay: విజయ్ ఎవడికి భయపడడు.. తొలి బహిరంగ సభలోనే పవర్‌ఫుల్‌ స్పీచ్‌

అసలు ఏం జరిగిందంటే.. హర్యానాకు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ రాజస్థాన్ రోడ్‌వేస్ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆమె టికెట్ తీసుకోకపోవడంతో కండక్టర్ లేడీ కానిస్టేబుల్‌కు చలాన్‌ జారీ చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో హర్యానా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్‌లు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. దీని తర్వాత, హర్యానా పోలీసులు రాజస్థాన్ నుంచి వెళ్లే ప్రతి బస్సుకు.. పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవర్, కండక్టర్ల సరైన యూనిఫాం, టైర్లలో గాలి పేరుతో చలాన్ జారీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా హర్యానా పోలీసులు హఠాత్తుగా భారీ మొత్తంలో చలాన్లు జారీ చేయడం రాజస్థాన్ రోడ్‌వేస్‌లో కలకలం సృష్టించింది.

READ MORE:Anantham Teaser: ల‌వ్ స‌స్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్

ఈ విషయం ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వ పెద్దలకు చేరిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజస్థాన్ రవాణా శాఖ అధికారులు హర్యానా పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. టికెట్ తీసుకోనందుకు మహిళా కానిస్టేబుల్‌కు చలాన్ జారీ చేసిన వైరల్ వీడియో కారణంగా.. రాజస్థాన్ – హర్యానాలో భారీ కలకలం చెలరేగింది.