పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని సింగరేణి నిర్వాశిత గ్రామం లద్నాపూర్ గ్రామస్తులు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..గ్రామంలో ఉన్న 283 మంది భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు నిరసన బాట పట్టారు. ఓసీపీ 2 విస్తరణలో భాగంగా గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఉరుకోబోమని హెచ్చరిస్తున్నారు..
సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నపూర్ లో నిర్వాసితులకు సింగరేణి అధికారులకు మధ్య గొడవ కంటిన్యూ అవుతుంది..సింగరేణి అధికారులు పోలీసుల సహాయంతో గ్రామంలోని ఇళ్లను కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నపూర్ గ్రామాన్ని ocp 2 విస్తరణలో భాగంగా సింగరేణి అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..దీంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు ఓసీపీ2 గేట్ ముందు ధర్నా చేపట్టారు.
సింగరేణి ఉద్యోగులు మైన్ లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాసితులు. గత రవారం రోజుల క్రితం భూనిర్వసితులు ఓసీపీ 2 క్వారీలోకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను తోచుకుంటూ వెళ్ళారు. ఈ క్రమంలో భూనిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగి ఘర్షణ కూడా చోటుచేసుకుంది.
లద్నాపూర్ గ్రామానికి చెందిన 283 భూనిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ప్యాకేజీ చెల్లించలేదని అవేమీ చేయకుండా గ్రామంలో పనులు మొదలుపెట్టడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్వాశిత కుటుంబాలలో 18 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికి ప్యాకేజీ, ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించే వరకు ఆందోళన చేస్తామని, ధర్నా విరమించేదే ప్రసక్తే లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు సింగరేణి నిర్వాసితులకు అండగా పలువురు రాజకీయ నిలబడ్డాడు. గ్రామస్తులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓసిపి 2 లో భూములు ఇళ్ళు కోల్పోయిన వారు అందరికీ పరిహారం అందించామని సింగరేణి అధికారులు చెబుతున్నారు..గత కొంతకాలంగా సింగరేణి అధికారులకు భూ నిర్వాసితులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Manda Krishna Madiga: జూలై 2,3 సడక్ బంద్.. బీజేపీ కి డెడ్ లైన్ ..