టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించారు.. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..విజయ్ గతంలో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. ఖుషి సినిమాపై విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకంగా వున్నాడు ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి సినిమా మంచి విజయం సాధించాలని ఎంతగానో కోరుకుంటున్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు జంటగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది. సమంత రీసెంట్ గా చేసిన శాకుంతలం సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో ఖుషి సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తుంది సమంత..వరుస ప్లాప్స్ తో వున్న ఈ జంట ఖుషి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి..
ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా మరింత స్పీడ్ పెంచేస్తున్నారు..ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ఇదిలా ఉండగా ఈ సినిమా డిస్టిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించు కున్నారు. ఈ మూవీను యూఎస్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు వారు సోషల్ మీడియాలో తెలిపారు.. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేసారు.ఖుషి సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించారు.ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.మరీ ఈ క్యూట్ లవ్ స్టోరీ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.