TDP vs YCP: చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే విరూపాక్షి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల, నెమకల్ గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండగా.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సంగాల గ్రామంలో వైసీపీ నేత గిరి, ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములుపై టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. వైసీపీలో చురుకుగా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నాయి. అలాగే గిరికి ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
Also Read
మరోవైపు నెమకల్ గ్రామంలో టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములు దాడి చేసి దళిత మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ వర్గీయులు ఆరోపించారు. ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పరామర్శించారు.
ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. చిప్పగిరి మండలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రించారు. పరస్పర దాడులు, వాహన ధ్వంసం ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు పోలీసుల అదుపులో ఉండగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు.. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
TDP vs YCP: చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే విరూపాక్షి!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!
-
India 8 Gold Medals: ఒకే రోజు 8 స్వర్ణాలు.. రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ సింగ్ రికార్డ్
-
Peru: కూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!