Kurnool Bus Tragedy: నేడు ఉదయం కర్నూలు నగర సమీపాన జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సు టూ వీలర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఇప్పటికే 19 మంది పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం ప్రమాదం నుంచి 29 మంది బయటపడగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే మృతదేహాలను వెలికి తీసిన తర్వాత బస్సును రోడ్డుపై నుంచి తొలగించే సమయంలో అపశృతి చోటుచేసుకుంది.
Delhi Visakhapatnam Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..
బస్సును రోడ్డుపై నుండి తొలగించడానికి వచ్చిన క్రేన్ బస్సును తొలగిస్తుండగా.. ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో క్రేన్ ఆపరేటర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనితో ఆపరేటర్ ను వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు ప్రమాదంలో సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు.
కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం బాధితుల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు ప్రారంభం!
ఈ ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన 19 మంది ప్రయాణికుల పూర్తి వివరాలు, వారి రాష్ట్రాల వారీగా సంఖ్యను అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పలువురితో పాటు వివిధ రాష్ట్రాల వారికి తీరని విషాదం మిగిల్చింది.
1.మృతుల వివరాలు కింద విధంగా ఉన్నాయి:
2.ఫిలొమెన్ బేబీ (Philomen baby), కర్ణాటక
3.కిషోర్ కుమార్ (Kishore kumar), కర్ణాటక
4.ప్రశాంత్ (Prashrath), పాలక్కాడ్, తమిళనాడు
5.అర్ఘా బందోపాధ్యాయ్ (Argha bandopachay), హైదరాబాద్, తెలంగాణ
6.యువన్ శంకర్ రాజ్ (Yuvan sankar raj), తమిళనాడు
7.మేఘనాథ్ (Meghanadh), తెలంగాణ
8.అమృత్ కుమార్ (Anmrit kumar), బీహార్
9.జి.డి. నాత్రి (GDnathri), ఆంధ్రప్రదేశ్
10.చందన (Chandana), తెలంగాణ
11.సంధ్యా రాణి (మంగ్) (SANDHYA RANI (MANGH)), తెలంగాణ
12.అనూష (Anusha), తెలంగాణ
13.గిరి రావు (Giri rao), తెలంగాణ
14.కేంగువ దీపక్ కుమార్ (Kengua Deepak kuma), ఒడిశా
15.రమేష్ (RAMESH), ఆంధ్రప్రదేశ్
16.శశాంక్ (SHASHANK), ఆంధ్రప్రదేశ్
17.మావత (MAVATHA), ఆంధ్రప్రదేశ్
18.శ్రీనివాస్ రెడ్డి (కావూరు) (Srinivas Reddy (Kavuru)), ఆంధ్రప్రదేశ్
19. గుర్తించలేదు.
ఈ ప్రమాదంలో మరణించిన 19 మందిలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 6, కర్ణాటక 2, తమిళనాడు 2, బీహార్, ఒడిశా రాష్ట్రాలలో చెరో ఒకరుగా గుర్తించారు. ఇక ఒకరిని గుర్తించలేదు అధికారులు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఒక మృతదేహాన్ని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటన వివిధ రాష్ట్రాల్లో విషాదం నింపింది.