Kunamneni Sambasiva Rao: పార్లమెంట్ ఎన్నికల వేళ మిత్ర పక్షాలైన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. ఈ మేరకు శనివారం డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క సీపీఐ కార్యాలయాని వెళ్లారు. ఆయన కార్యాలయానికి రావడం సంతోషదాయకమని సీపీఎం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని భట్టీ కోరినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ కు తాము మిత్ర పక్షాలైనప్పటికీ ఒకటి రెండు చోట్ల పోటీ చేయాలనుకున్నామన్నారు. ఐతే ఇండియా కూటమిలో భాగంగా బీజేపీని నిలువరించడానికి సపోర్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు.
దేశంలో రాష్ట్రంలో బీజేపీని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమేనని ఆరోపించారు. ఎలక్ట్రోల్ బాండ్ల లో బీజేపీ కూరుకుపోయిందన్నారు. మోదీ అంటేనే అహంకారం, నియంత పాలన అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను మోదీ గ్యారంటీ అని పిలవడాన్ని ఆయన విమర్శించారు.
READ MORE: CM Revanth reddy: సివిల్ టాపర్ అనన్యను సన్మానించిన సీఎం
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పతనమైందని.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీని తెలంగాణ లో నిలువరించడం కోసమే కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. భువనగిరి లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. తాము ముందుగా ఐదారు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని.. అలా చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉందని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
భవిష్యత్, దేశ అభివృద్ధి, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమి ఓ వైపు.. భారత రాజ్యాంగాన్ని విద్వంసం చేయడమే లక్ష్యంగా, ఈ దేశ వనరులను క్రోని క్యాప్టలిస్టులకు దారాదత్తం చేసిన బీజేపీ మరో వైపు ఉన్నాయన్నారు. తెలంగాణే కాదు దేశ ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునచ్చారు. లౌకికవాదం దేశానికి అవసరమని.. నిన్న తాను సీపీఎం కార్యాలయానికి వెళ్లి మాట్లాడినట్లు వెల్లడించారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారన్నారు. చట్ట సభలో సభ్యులు లేనంత మాత్రన ఆయా పార్టీలను తక్కువ చేసి చూసే వాళ్లం కాదన్నారు.