Kunamneni Sambasiva Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబుక్యాంపు లోని రజబ్అలి భవన్ లో సింగరేణి.. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధుల తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ పై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి లో ప్రైవేటు వ్యవస్థ లతో బొగ్గు ఉత్పత్తి యత్నాలను విరమించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బావుల మీద శ్రద్ధ చూపకుండా ప్రైవేట్ వ్యాపారల పై అధిక శ్రద్ధ చూపుతుందని, సింగరేణి లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయన్నారు కూనంనేని సాంబశివరావు. సంస్థ లో అవినీతి తరా స్థాయి కి చేరుకుంటున్నది, రాజకీయ జోక్యం బాగా పెరిగిందని, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలన్నారు.
Mahindra Thar: మహీంద్రా థార్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి వరకే ఛాన్స్..
సింగరేణి కి ప్రభుత్వం బకాయి పడ్డ వేల కోట్లు చెల్లించాలని కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉద్యమమని, సింగరేణి లో కీలక డైరెక్టర్ పోస్టులు ఖాళీ, సీఎండీపై స్పష్టత లేదు, యాజమాన్యం లో గందరగోళం నెలకొందన్నారు. సింగరేణి ఉత్పత్తి పై ప్రభావం, ఎన్నికల కోడ్ లకు సంస్థ కార్యకలాపాల కు సంబంధం ఏంటి, కోడ్ పేరుతో కార్మికుల సమస్యల పరిష్కారం పై నిర్లక్ష్యం తగదన్నారు కూనంనేని. కొత్తగూడెం , ఇల్లందు కొత్త గనుల్లో బొగ్గు సైతం ప్రైవేటు కు అప్ప చెప్పే చర్యలు చట్ట విరుద్ధమని, బీఆర్ఎస్ ప్రభుత్వం లో ప్రైవేటీకరణ కు ఎక్కువ మొగ్గు చూపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బొగ్గు తీసే పనులును సింగరేణి సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోవాని ఆయన అన్నారు.
KTR : కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్.. కీలక అంశాలపై చర్చ