NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao : నయా హిట్లర్‌లాగా నరేంద్రమోడీ

Kunamneni Sambhasiva Rao

Kunamneni Sambhasiva Rao

నరేంద్రమోడీ నయా హిట్లర్‌ లాగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షం చూస్తే వణికిపోతున్నాడని ఆయన విమర్శించారు. అదానీ కుంభకోణం నుండి బయటపడటానికి రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకున్నాడని ఆయన విమర్శించారు. నరేంద్రమోడీ గతంలో మన్మోహన్‌ సింగ్‌ను పేరుపెట్టి అనేక రకాలుగా అవమానాలు చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Life Threatening: ఆ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని.. వైసీపీ నేత ఆరోపణలు..!

రాహుల్‌ గాంధీ కుటుంబం, వారి తండ్రి గురించి వ్యాఖ్యానం చేస్తూ రాహుల్‌ గాంధీ నెహ్రు పేరు ఎందుకు పెట్టుకొలేదని కామెంట్స్‌ చేసిన నరేంద్రమోడీ అదానీ కుంభకోణం నుండి బయటపడటానికే ఈ పద్ధతులకు పాల్పడుతున్నాడని సాంబశివరావు ధ్వజమెత్తారు. నెలరోజుల సమయం వుండగానే ఇంత హడావుడిగా రాహుల్‌ని అనర్హుడిగా ప్రకటన చేయడమంటే ప్రజాస్వామ్యం అనే పదం పలికే అర్హత నరేంద్రమోడీ కోల్పోయాడని విమర్శించారు. ఇది నరేంద్రమోడీ కుట్రనేని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Rahul Gandhi Disqualification: రాహుల్‌ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..