NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao : బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి

Kunamneni Sambhasiva Rao

Kunamneni Sambhasiva Rao

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, బహిరంగంగా మాట్లాడలేని పదాలతో మాట్లాడిన బండి సంజయ్‌పై మహిళలను కించపరిచే వారికి ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయో అలాంటి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ డిమాండ్‌ చేస్తోందని చెప్పారు. తెలిసీతెలియని పరిమితమైన జ్ఞానం కలిగిన పరిపక్వత లేని వారు మాట్లాడటం వేరు అని, తెలంగాణలో అధికారంలోకి వచ్చే బీజేపీకి అధ్యక్షుడుని అని పదేపదే చెప్పుకునే బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా వున్నాయని అన్నారు.

Also Read : MLC Kavitha : ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

కవితపై విచారణ జరుగుతున్న క్రమంలోనే అరెస్టులపై ద్వంద అర్థాలు వచ్చే విధంగా సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళికలో భాగమేనని కూనంనేని విమర్శించారు. దీనిని బట్టి బీజేపీ ఆఫీసు నుండే స్క్రిఫ్ట్‌లు తయారు అవుతున్నట్లుగా స్పష్టమవుతున్నదని, కవితను అరెస్టు చేస్తారనే నిర్ణయానికి బీజేపీ నాయకులు ముందే వచ్చారని అన్నారు. ప్రతిపక్షాల నోర్లు నొక్కడానికి ముందస్తు ప్రణాళికతోనే అరెస్టులు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ప్రభుత్వాలు, విమర్శించే వారిపైన కేసులు పెడుతున్నారని, బీజేపీలో చేరి, వారి కండువా కంపుకొని లొంగిపోయే వారిపైన కేసులు ఉండవా అని సాంబశివరావు ప్రశ్నించారు.

Also Read : Groom Sleeps At Wedding: పెళ్లిలో తాగి పడుకున్న వరుడు..ఆ తరువాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయమని హిందూ సంస్కృతి, సాంప్రదాయం నేర్పిందా అని, రాముడు మహిళల పట్ల అత్యంత గౌరవంగా వుండేవారని, హిందూ మతం, రాముడు పేరు చెప్పుకునే బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ్యత కాదని కూనంనేని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Show comments