NTV Telugu Site icon

BJP JDS Alliance: ఎన్డీయేలో చేరిన జేడీఎస్.. స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా

Jds

Jds

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరింది. శుక్రవారం జేడీఎస్ నేత కుమారస్వామి హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలో సీట్ల పంపకంపై ముగ్గురు నేతల మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Botsa Satyanarayana: స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు..

సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో జేడీఎస్ చేరిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. “హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామిని కలిశారు. ఎన్డీయేలో చేరాలని జేడీఎస్ నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్డీయేలోకి కుమారస్వామిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోడీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. మరోవైపు ఎన్డీఏతో పొత్తు కుదిరిందని.. సీట్ల పంపకంపై చర్చిస్తామని హెచ్‌డి కుమారస్వామి చెప్పారు.

Pocharam Srinivas Reddy: చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికం

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ పొత్తు కీలకంగా పరిగణించబడుతుంది. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా.. దానికి మద్దతు ఇచ్చిన స్వతంత్ర పార్టీ నుంచి ఒక సీటు గెలుచుకున్నారు. కాగా.. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు గెలుచుకుంది.

Show comments