IND vs BAN: బంగ్లాదేశ్‌తో రేపు జరిగే మూడో వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్‌ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది.
బంగ్లాదేశ్‌తో జరిగే మూడో వన్డేకు తప్పుకున్న ముగ్గురు ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉన్నాడని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. మూడో వన్డేలో కేఎల్ రాహుల్ సారథ్యం బాధ్యత వహించనున్నాడు. గాయం నేపథ్యంలో రోహిత్ మూడో వన్డేకు దూరమయ్యాడని, నిపుణులను సంప్రదించేందుకు ముంబై వెళతాడని ద్రవిడ్ పేర్కొన్నాడు. గాయాల వల్ల రోహిత్‌తో పాటు బౌలర్లు కుల్దీప్ సేన్‌తో పాటు దీపక్ చాహర్ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. మొదటి వన్డే తర్వాత ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ తన వెన్నులో నొప్పిగా ఉందని తెలపడంతో మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. బీసీసీఐ వైద్య బృందం అతడిని అంచనా వేసి 2వ వన్డే నుంచి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. తోటి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌కు రెండో వన్డే సమయంలో గాయం కాగా… సిరీస్‌కు దూరమయ్యాడు. కుల్దీప్ సేన్, దీపక్ ఇద్దరూ ఇప్పుడు వారి గాయాల నిర్వహణ కోసం ఎన్‌సీఏకు రిపోర్ట్ చేస్తారు.
Burqa Dance Video: బురఖాలు ధరించి డ్యాన్సులు.. 4గురు విద్యార్థులు సస్పెండ్.. వీడియో వైరల్
రోహిత్ శర్మకు రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చేతి బొటనవేలికి గాయమైంది. రోహిత్ ఢాకాలోని స్థానిక ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకున్నాడు. అనంతరం స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసం ముంబైకి వెళ్లాడు. రాబోయే టెస్ట్ సిరీస్‌కు రోహిత్ ఉంటాడా లేదా అనేది త్వరలో నిర్ణయించబడుతుందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
బంగ్లాదేశ్‌తో జరిగే 3వ వన్డేకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (సీ) , శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (డబ్ల్యూకే), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.